నేటితరం సంచలనం విజయ్ దేవరకొండ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Categories MoviesPosted on
vijay devarakonda

ఒక చిన్న ఉద్యోగనికే రిఫరెన్స్ వాడుతున్న ప్రపంచం.మరి అదే సినీ పరిశ్రమ అయితే,అనుడిలో కోట్లమందికి అభిమాన నటుడిగా మరే హీరో పాత్రకు ఛాన్స్ అంత ఈజీగా రాదు.అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి ఒకడిగా మద్రాస్ మహనగరనికి చేరి ఇప్పుడు ఒకటవ స్థానంలో కూర్చొని ఉన్నారు.ఆ తర్వాత తెలుగు పరిశ్రమ చెప్పుకునే పెరు మాస్ రాజా రవితేజ.ఆ తర్వాతి తరంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి వచ్చి మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయారు న్యాతురల్ స్టార్ నాని.ఇదంతా ఇప్పుడెందుకు అంటే మన ముందే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేటితరం యూత్ ఐకాన్ గా ఎంతోమందికి రౌడీలా మారిన స్టార్ హీరో విజయ దేవరకొండ పుట్టిన రోజు కనుక..!

raviteja-chiranjeevi

2011 లో రవిబాబు సినిమాలో ఆ తరువాత ఒకటి రెండు సినిమాలలో కనిపించాడు విజయ్.అయితే 2015లో నానితో చేసిన ఎవడే సుబ్రమణ్యం సినిమా తో అటు ప్రేక్షకులకు,ఇటు ఇండస్ట్రీ వారికి చేరువయ్యాడు.2016 లో పెళ్లి చూపులు సినిమాతో చిన్న సినిమాలలో అతి పెద్ద హిట్ కొట్టిన దేవరకొండ అర్జున్ రెడ్డి తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు.ఇటీవల వచ్చిన గీత గోవిందంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరో,ఈ మాట నేను కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవిగారు చెప్పారు.అటువంటి విజయ దేవరకొండ పుట్టిన రోజు మే 9.ఈసారి ఆయన పుట్టిన రోజుకు ఒక స్పెషల్ ఉంది అదే ఆయన ఫేవరేట్ హీరో మహేష్ బాబు మహర్షి విడుదల అవుతూ వుండడం.

vijya devarakonda

విజయ దేవరకొండ గురించి రాయాలి అని నాకు చెప్పగానే నాకు ఆయనకు ఉన్న కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి.అది 2015 ఎండింగ్ అనుకుంటా నా మిత్రుడి అన్నయ్య నుండి కాల్,ఏదో సినిమా డిస్ట్రిబ్యూషన్ అమెరికాలో తీసుకుంటున్నాడు,నన్ను మరో స్నేహితుడిని ప్రొడక్షన్ ఆఫీస్ కి ఒక్కసారి వెళ్లి రమ్మని సారాంశం.అయితే అందరూ కొత్త వాళ్ళు అనగానే అసలు తీసుకోవద్దు అని చెప్పేశాను.అస్సలు ఆఫీస్ కి కూడా నేను పోలేదు,ఆ తర్వాత సినిమా విడుదల అయింది.సినిమాకు మంచి స్పందన వచ్చని అని యూఎస్ లో కలెక్షన్స్ బాగున్నాయి అని నా మిత్రుడు చెప్పాడు,అప్పటికి నేను సినిమా చూడలేదు.మరో ఇద్దరు స్నేహితులు ఇంకా సినిమా చూడలేదు అంటూ నన్ను ఒక్క రోజు సెకండ్ షోకి తీసుకెళ్లారు.చిత్రం నిజంగా చాలా బాగుంది.

కొన్ని రోజుల తర్వాత నేను ప్రసాద్ లాబ్స్ కు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ కు వెళ్ళాను.అదే షో కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్.షో తర్వాత విజయ్ అవతల పక్కన ఉంటే నేను ఇవతల వున్నాను.అసలు తనతో ఫోటో దిగాలి అనే ఆలోచన నాకు గాని నా స్నేహితులకు గాని లేదు ఆ రోజు,ఆయన పక్కన ఎవరు లేరు డ్రైవర్ తప్ప.దాదాపు సంవత్సరం తర్వాత అనుకుంటా ఇలానే ఏదో పని మీద ప్రసాద్ లాబ్స్ కి వెళ్లి వస్తుంటే అక్కడ ఇద్దరు బౌన్సర్స్,ఒక మంది బాయ్స్ అండ్ గర్ల్స్ సెల్ ఫోన్ లో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి వున్నారు,నేను ఎవరు వస్తున్నారు అని ఒక కుర్రాడిని అడిగితే,తను అర్జున్ రెడ్డి,విజయ్ దేవరకొండ అని గర్వంగా చెప్పాడు.నిజంగా ఒక రెండు సంవత్సరాలలో ఆయన స్టార్డం అమాంతం ఆకాశానికి వెళ్ళిపోయింది అనిపిస్తుంది ఈ రెండు సంఘటనలు గుర్తుచేసుకుంటే.

vijya devarakonda

అంతటి విజయం కుర్ర వయసులో వస్తే కళ్ళు నేటికెకుతాయి అని అంటుంటారు.కానీ విజయ్ కి అవేమి లేవు అని అనిపిస్తుంది.ఇటీవల సూర్యకాంతం ప్రి రిలీస్ వేడుకకు విజయ్ దేవరకొండ వచ్చాడు.అతన్ని చూసి అమ్మాయిలు,అబ్బాయిలు కేకలు పెడుతున్నారు.కానీ తను మాత్రం అక్కడ ఉన్న తనకు తెలిసిన వారందరినీ బౌన్సర్స్ ని పక్కకు పంపి ఆప్యాయంగా పలకరించాడు.పెద్దవారికి తాను చూపిన గౌరవం చాలా బాగా నచ్చింది.మనం ఎంత ఎత్తుకి ఎదిగినా అడిగి ఉండాలి అని మంచి అలవాటును ఆయన అవలభించుకున్నాడు అని అనిపించింది.

జయాపజయాలు సర్వ సాధారణం.అందులో హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్న సినీ పరిశ్రమలో ఇంకా సాధారణం.కనుక విజయం సిద్దంచాలి అని కాక తాను జయాపజయాలను ఒక్కేలా తీసుకునే స్థాయికి తన మానసిక పరివర్తన చెందాలి అని కోరుకుంటూ,మరెనో పుట్టినరోజులు ఇలాంటి స్టార్డంలో జరుపుకోవాలి అని ఆసిస్తూ lemon soda team తరపున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు!!

Leave a Reply

Your email address will not be published.