The Truth About Love at First Sight!!

Categories Lemonsoda's StoriesPosted on
love at first sight

ఫస్ట్ లవ్ అదే నండి తొలి ప్రేమ . తొలి ప్రేమ , ఇప్పుడు దీని గురించి ఎందుకు అనే గా  మీరు అడగబోయే ప్రశ్న .. కరెక్ట్ గా  రెండు సంవత్సరాలు ముందు, నా  తొలిప్రేమ ని నేను కొల్పోయిన రోజు  ఈరోజు . అది మర్చిపోలేని గుర్తులను, మానిపోని గాయాలను చేసింది. ఆ గాయాలు ,ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను కాల్చుతూనే  వున్నాయి .అందుకే మీరయినా జాగ్రత్తపడతారని  నా అనుభవం, అంటే నాకు జరిగిందే కాక ,నేను చూసిన దాని వల్ల వచ్చింది కూడా కలిపి ఈ  తొలిప్రేమ టాపిక్ గురించి ఈరోజు  మీకు చెబుదాం అని అనుకుంటున్నా ..

మనకి గుర్తువుండిపోయేలా మనం రాసుకున్న కథే (తొలిప్రేమ). ఇందులో గెలిస్తే జ్ఞాపకాలు, ప్రేయసి  మిగులుతాయి. అదే  ఓడిపొతే  జ్ఞాపకాలు, గాయాలు గుర్తులు గా  మిగిలిపోతాయి . ప్రేమ లో లేనివాడికి  నాకు లేదే  అనే నిరాశ, ఉన్నవాడికి  ఎప్పుడు దీని నుండి బయటకి రావాలి అనే ఆశ . ఒదిలేసినవాడికి తననే( అతని లవర్ మీద )   ద్యాశ.  ప్రేమ  పుస్తకాల్లో , చిత్రాల్లో  మాత్రమే అందంగా ఉంటుంది, అమృతాన్ని పంచుతుంది . కానీ నిజజీవితం లో  విషం నిండిన అమృతం వంటిది. ఇది తక్కువ మందికి ఆనందాన్ని పంచుతుంది, ఎక్కువమందికి గుణపాఠం నేర్పుతుంది. నేను ప్రేమించడాన్ని తప్పు అనను. అలాగే ప్రేమించవద్దు  అని  అనను. ప్రేమ లో  నవ్వడం కంటే ఏడవడం ఎక్కువ ఉంటుంది. భాద్యత  అనేది తీసుకోవాల్సి వస్తుంది .

నేను అడ్జస్ట్ అవ్వగలను అనుకుంటే ప్రేమించు లేదా. బాధ భరించడానికి సిద్ధపడినపుడు ప్రేమించు. లేకుంటే నాలా  ఏడవడానికి కన్నీళ్ళు లేక, నవ్వడానికి కారణాలు వెతుక్కోలేక  ఖాళీగా  కాలిపోతూ ఉంటావు.