ది జర్నీ అఫ్  సూపర్ స్టార్ మహేష్

Categories MoviesPosted on
maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు తెలియని తెలుగువారు వుండరు, దక్షణ భారతదేశం లో వున్నా పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ లో మహేష్ బాబు కూడా ఒకరు. ఇతని క్రేజ్ ఒక్క భారత దేశం లో నే కాకా ప్రపంచమంతా వ్యాపించింది.

మహేష్ పూర్తి పేరు ఘట్టమనేని  మహేశ్ బాబు,ఈయన  ఆగష్టు 9, 1975 న జన్మించారు . ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇప్పటి వరకు కథానాయకుడిగా 24 చిత్రాల్లో నటించాడు, తన ప్రతిష్టాత్మక  25 వ చిత్రం ఈరోజు విడుదల కానుంది.

మహేష్సినిమాజర్నీ

మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.

2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంనంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.మహేష్ తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.

అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. అతడు చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 2005లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంనంది లభించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను ప్రశంసించారు. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

పోకిరీ తరువాత నిర్మాణమయిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చినదూకుడుచిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగేబిజినెస్ మాన్కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. 2013 లో దగ్గుబాటి వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించినసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టువిడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తరువాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో “1 నేనొక్కడినేఅనే చిత్రంలో నటించారు. ఆ తరువాత 2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది. ఆ తరువాత 2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు. మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసినస్పైడర్చిత్రం 2017 సెప్టెంబర్ 27న విడుదలైంది. ఆ తరువాత 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చినభరత్ అనే నేనుచిత్రం మంచి విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు. తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో చేస్తున్నారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం.

మహేష్ బాబు డైరెకటర్స్ ఆక్టర్, అందుకే ప్రతి డైరెక్టర్ కి మహేష్ బాబుతో మూవీ చేయడం ఓ కల.

మహేష్ కు సెన్స్ అఫ్ హ్యూమర్ ఎక్కువ గ ఉండటంతో అతనితో పనిచేసిన ప్రతిఒక్కరు మల్లి మల్లి పనిచేయాలనుకుంటారు.

మహేష్ బాబు తన నటనకు ప్రతిఫలంగా అనేక అవార్డులు అందుకున్నారు. తాను హీరో గా చేసిన మొదటి సినిమా రాజకుమారుడు తోనే ఉత్తమ నూతన నటుడి గా నంది  పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారి ఉత్తమ నటుడు గా నంది పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు,2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు.

ఇప్పటివరకుఆయనగెలుచుకున్నఅవార్డులు

సంవత్సరం                      చిత్రం                                పాత్ర                                                  విశేషాలు

1999                    రాజకుమారుడు                         రాజా                           నంది ఉత్తమ నూతన నటుడు పురస్కారం

2000                     యువరాజు                                శ్రీనివాస్

2000                    వంశీ                                       వంశీ

2001                     మురారి                                     మురారి                              నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం

2002                      టక్కరి దొంగ                               రాజు                                     నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం

2002                       బాబీ                                     బాబీ

2003                       ఒక్కడు                                  అజయ్                   దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం

2003                        నిజం                                   సీతారామ్                                  నంది ఉత్తమ నటుడు పురస్కారం

2004                       నాని నాని

2004                        అర్జున్                                     అర్జున్                                          నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం

2005                         అతడు                            నందగోపాల్ (నందు) / పార్థు                 నంది ఉత్తమ నటుడు పురస్కారం

2006                         పోకిరి                                కృష్ణ మనోహర్ పండు       దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం

2006                          సైనికుడు                                 సిద్ధార్థ

2007                           అతిథి                                     అతిథి

2010                         ఖలేజా                                      సీతారామరాజు

2011                         దూకుడు                                   అజయ్                                     నంది ఉత్తమ నటుడు పురస్కారం

                                                                                                                          దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం

2012                           బిజినెస్ మేన్                              సూర్య                     దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం

2013                           సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు       చిన్నోడు

2014                            1                                                 గౌతం

2014                           ఆగడు                                         శంకర్

2015                           శ్రీమంతుడు                                   హర్ష

2016                           బ్రహ్మోత్సవం

2017                           స్పైడర్ శివ

2018                           భరత్అనేనేను                               భరత్

2019                            మహర్షి (2019 సినిమా)                   రిషి

 

హిట్ సినిమాలు చేసి ఎన్నో అవార్డులు అందుకున్న, మహేష్ బాబు అందరితో ఎంతో అనుకువతో ఉంటాడు. అందుకే సినిమా ఇందుఁడస్ట్రీ లో మహేష్ కు ఓ ప్రత్యేక మైన స్తానం వుంది.

ఇతనికి నటుడిగానే కాకుండా యాడ్ ఫిలిమ్స్ లో కూడా మంచి క్రేజ్ వుంది. అందుకే అనేక బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

మహేష్  బాబు సాంగీక సంక్షేమ కార్యక్రమాలలో చురుకు గా పాల్గొంటూ, ఆర్ధిక సాయం చేస్తూ వుంటారు, నిజానికి మహేష్ సంపాదనలో 30 శాతం ఛారిటీలకే వెళ్తుంది.

మహేష్ తన 26 వ చిత్రం అనిల్ రావిపూడి తో చేస్తున్నారు..

ఇదండీమనమహేష్బాబుమూవీజర్నీతెలుసుకున్నారుగా

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి..

అలాగే మా లెమన్ సోడా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి 

1 comment

Leave a Reply

Your email address will not be published.