గుడిలో రామయ్య.. తెలుగోడి గుండెల్లో తారక రామయ్య..

Categories MoviesPosted on
nandamuri taraka ramarao
1949వ సంవత్సరం.. మన దేశం అనే చిత్రంతో మన ముందుకు వచ్చి తెలుగు జాతికే వన్నె తెచ్చిన యుగపురుషుడు.
ఆయన చేసిన ప్రతి పాత్ర చరిత్ర చర్చించుకునే స్థాయిలో.. రాసిన ప్రతి మాట చరిత్రలో నిలిచిపోయేలా.. తీసిన ప్రతి చిత్రం చరిత్ర తిరగరాసేలా.. తెలుగు చలన చిత్రాల్లో తానే ఒక చరిత్ర అంటే అతిశయోక్తి కాదనే చెప్పుకోవాలి.
ఆయన అని గౌరవంతో పలకరించే దగ్గర నుండి అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే స్థాయికి ఎదిగినిన వ్యక్తి.
పేరుకి ముందు వెనుక తల.. తోకలను పెట్టుకునే హీరోల్లా కాకుండా తన పేరే ఒక బ్రాండ్ గా మార్చుకున్న నట సార్వభౌముడు..
తెలుగు ప్రజలకు దుర్యోధనుడు అయినా దుశ్శాసనుడు అయినా ఆయనే.. కృష్ణుడు..రాముడి పాత్రలనే కాదు రావణాసురుడిగా కూడా మెప్పించి మన్ననలు పొందిన ఏకైక నటుడు..
పేరు తెచ్చిన పౌరాణిక పాత్రలే కాకుండా.. సాదా సీదా కుర్రాడిలా.. పక్కింటి అబ్బాయిలా.. అమాయక చక్రవర్తి లా.. జస్టిస్ చౌదరిగా.. సర్దార్ పాపారయుడిగా..మేజర్ చంద్రకాంత్ గా..డ్రైవర్ రాముడిగా.. అడవి రాముడిగా.. అలా రామయ్య ఎన్నో మరెన్నో పాత్రలు పోషించి కళామ తల్లి ముద్దుబిడ్డ గా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
రాతి బొమ్మల్లో చూసి ఆనందించే రాముడిని.. కృష్ణుడిని.. తెర మీద చూసి మురిసిపోయే విధంగా చేసిన నందమూరి తారక రామారావు గారికి ధన్యవాదాలు. జోహార్ NTR!