Fan of trivikram answering to the queries of his SOUL..

Categories MoviesPosted on
Trivikram Srinivas

దూరంగా ఉన్న కొండని చూస్తూ ఒక అబ్బాయి.. అతని పేరు అభిమాని..

అంతరాత్మ :- సామి శిఖరం.. చెట్లేం చెయ్యలేవు..

అభిమాని :- అలాగా… అదే అనుకున్నాం… అయినా నేను ఎదవలతో మాట్లాడను.. పో..

అంతరాత్మ :- నేను మాట్లాడతాను..  హీరోని , హీరోయిన్ ని చూసి.. పోస్టర్ లు చూసి.. వెళ్లే మీకు రచయితలను , దర్శకులను చూసి వెళ్లే కర్మ ఏంట్రా..

అభిమాని :- అక్కెళ్ల నాగ శ్రీనివాస శర్మ.. ఈ పేరు ఎవరిదో తెలుసా..

అంతరాత్మ :- ఆయనదే..

అభిమాని :- ఆయన అంటే ఎవరు..

అంతరాత్మ:- written పేరు నుంచి డైరెక్షన్ అనే పేరు వరకు వచ్చి ఉన్న పేరు పోగొట్టుకున్న మనిషే కదా..

అభిమాని :- నువ్వు ఎవరనుకొని ఎవరి గురించి మాట్లాడుతున్నావ్..

అంతరాత్మ :- దోశ ను నీళ్లలో అద్దుకొని తినే దాని గురుంచి రాసినంత ఈజీ కాదు రా స్టార్ హీరోలతో హిట్ కొట్టడం..

అభిమాని :- ఒక్క సినిమా పోతే ఇంతలా అంటారా ?

అంతరాత్మ :- ఇదిగో ఏమన్నా అంటే అన్నానంటారు.. మాటలు రాసిన కథలన్నీ హిట్లే కదా.. ఈ డైరెక్షన్ లు గట్రా మనకవసరమా చెప్పండి..

అభిమాని :- స్టార్ హీరోలు ఇద్దరకీ హిట్లు ఇచ్చాడు.. గుర్తులేదా..

అంతరాత్మ:- ఒకటి హిట్టు కొట్టాం కదా అని ఇంకొక సినిమా చెయ్యకూడదు రా.. అలా అని హీరోలు ఒప్పుకున్నారు కదా అని కథ లేని సినిమాలు చెయ్యకూడదు రోయ్..

అభిమాని :- ఇప్పుడేంటి.. ఇప్పుడేం అంటావ్.. మరీ తక్కువ చేసి మాట్లాడుతున్నవ్..

అంతరాత్మ :- ఆయన ఇంకో సినిమా తీస్తున్నాడా అండి.. ( తల ఆడిస్తూ ) అయితే ఇక కష్టమే అండి.. కథ ఒక్క లైన్ ఉంటే ల్యాగు బుక్ అంత ఉంది.. మీరు రాసుకునే మాటలే మిమ్మల్ని కాపాడాలి..

అభిమాని :- చుస్తావ్ గా..

అంతరాత్మ :- చివరి సినిమా కథ అనుకున్నారా..? మాటలు రాసుకున్నారా.. ? మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకున్నారా..? పెద్ద హీరో ను పెట్టుకున్నాడా..? అయినా ఎందుకు నచ్చలేదట జనాలకి ? ముందు డైరెక్షన్ నేర్చుకోవాలి.. ఇలా అయితే ఎలా రా..

( డైలాగ్ మొత్తం అభిమాని అన్నింటికీ తల ఊపుతూనే ఉంటాడు )

అభిమాని :- ఇప్పుడు నన్ను ఏం చెయ్యమని ఇదంతా చెప్తున్నా రు

అంతరాత్మ:- మొత్తం వినురా అంటే మధ్యలో ఇలాంటి చెత్తలో ప్రశ్న లేంట్రా..

అభిమాని :- ఇంకా అవ్వలేదా.. ఇంతకంటే నా వల్ల కాదు.. నేను ఆయనను అలా అంటుంటే వినలేకున్నా..

అంతరాత్మ :- ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు.. నేను ఇంత మాట్లాడుతున్నా ఒక్క మాట అనకుండా కూర్చున్నావు..

అభిమాని :- గౌరవం నా మీద నాకున్న గౌరవం.. నేను జంతువుని కాదు మనిషిని అన్న గౌరవం..

అంతరాత్మ:- పర్లేదు… నీకు డైలాగ్ లు ఒచ్చు..

అభిమాని :- డైలాగ్ రూపంలో ఆయన రాసిన మాటను ఏరోజు చూడని అభిమానిని..

ఆయన మంచి చెప్పే సమయంలో ఒక అన్నయ్య కనిపించేవాడు..

ఒకరి గెలుపులో చెప్పట్లు కొట్టి ఉండేవారి కంటే ఒకరి ఓటమిలో వెన్ను తట్టే వారే మనకు ముఖ్యం..

మీ వెనుక నిలిచే మాకోసం కాకపోయినా.. మీ వెనుక మాట్లాడే వీళ్ళ కోసమైనా..

మీరు మౌనం వీడి.. మీ కలంతో మాట్లాడించండి..

ఇకనైనా అజ్ఞాతం వీడి..అద్భుతాలు సృష్టించండి..

గురూజీ అంటూ ఎందరో మీ ఏకలవ్య శిష్యులకు అండగా నిలవండి..

ఇప్పటికీ..ఎప్పటికీ..

మీ మాటలో..

నీ నవ్వు వరం..

నీ కోపం శాపం..

నీ మాట శాసనం..