స్టేట‌స్‌లు..దాని వల్లే వచ్చే ఇబ్బందులు

Categories Lemonsoda's StoriesPosted on
status

స్టేటస్ లు ఇవి మన గురించి మన కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్ళకి లేదా మనల్ని ఫాలో అయ్యే  వాళ్ళకి తెలియడానికి పెట్టేవి. కానీ అవే  స్టేటస్ లు  కాంటాక్ట్ అవసరం అవుతుంది  అని సేవ్ చేసుకున్న పాపానికి ఏం  పెట్టారో చూద్దాం  అని  ఓపెన్ చేస్తే,  ఎందుకు ఓపెన్ చేసాం అనే బాధ, ఏంటి వీళ్ళు  అని జాలి రెండూ  ఒకేసారి కలుగుతాయి  స్టేటస్  మనం ఎలా వున్నాం,ఏం  చేస్తున్నామో  మన వాళ్ళకి  చెప్పడానికి పెట్టింది . కానీ అదే ఇప్పుడు ఎందుకు వుంది రా బాబు  అని  బాధపడేలా  చేస్తున్నారు. సర్లే స్టేటస్ లేగా పెట్టింది తిప్పేస్తే  పోతుంది అనే వాళ్ళూ  లేకపోలేదు .. అలా  చేసిన పోస్ట్ ల  తో చిరాకుతెప్పిస్తారు. ఎక్సామ్  హాల్ లో అరగంట కొకసారి గంట కొడ్తూ టైం ని గుర్తు చేసినట్టు వీళ్ళు  పోస్టులతో  రోజు కి  ఇంకా ఇన్ని గంటలు  వున్నాయి అని గుర్తుచేస్తారు. అన్ ఫాలో  చేస్తే వదులుతారనుకుంటే  వదలకుండా ఫోన్ చేసి  అన్ ఫాలో ఎందుకు చేసావ్ ? నన్ను, మళ్ళీ  ఫాలో చెయ్యి  అని ఫాలో  చేసేదాకా వదలరు . వాడి ఫాలోవర్స్  కోసం మన ఓపిక కి  మన టైం కి పరీక్ష  పెడతారు. ఎందుకు వాడి పోస్ట్ చూడ్డం  అనే వాళ్ళు లేకపోలేదు, ఓపెన్ చేయగానే వచ్చే  10 పోస్ట్ ల్లో  4 వాడివే ఉంటాయి.  ఫాలో చేస్తే వదలడు అన్ ఫాలో చేస్తే ఊరుకోడు.

స్టేటస్ కష్టాలు :

వీళ్లు షేర్ చేసిన లింక్ ని  ఒకసారి  ట్రై చేయి అంటారు, సర్లే చేస్తా అంటే వదలరు  చేసేదాకా ఒప్పుకోరు అదే నండి ( ఇందులో లాగిన్ అయితే  మీ ప్రొఫైల్ పిక్ ని స్కెచ్ వేసి ఇస్తుంది బ్లాక్ అండ్ వైట్ లో అలాంటిది, ఇంకా  కొన్ని అప్లికేషన్స్  లో మీరు నన్ను ఏమి అయినా అడగొచ్చు అని స్టేటస్ లో పెడతారు, ఇంక చూడు నన్ను  కాకపోతే   అడిగారు అని ఒక 30 స్లైడ్స్ తమని అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతారు. పులి ని చూసి నక్కా వాత పెట్టుకుంది అంట ఆలా వీళ్ళని చూసి ఇంకో పది మంది తయారు అవుతారు . ఇంకా స్లయిడర్స్ పెడ్తారు ఎమోజిస్  తో మీరు ఈ స్టేటస్ లో వున్నా దానికి ఎంత పెర్సెంటేజ్  ఇస్తారు అని మార్క్ లు వేయించుకుంటారు

వాళ్ళు చేసిన షార్ట్ ఫిల్మ్స్ లేదా ఆర్టికల్స్ వాళ్ళ స్టేటస్ లోనే  కాకా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా షేర్ చేయమంటారు.  ఇంకొందరు  సినిమా లోని  డైలాగ్స్ ని అనుకరించి పెడతారు. వాడి స్టేటస్ ఏం  చూస్తాం అని బద్దకం తో చూడకపోయినా. స్టేటస్ లు ఎంత మంది చూసారు, ఎవరు ఎవరు చూసారు అని కూడా చూపిస్తుంది.  సో, మెసేజెస్ చూసేదాకా ఆగరు.

స్టేటస్ తమ లో దాగున్న కళ నలుగురికి  తెలియాలని  వాళ్లనుండి ప్రశంసలు పొందాలి అని వాళ్ళు చేసే  ప్రయత్నం కొందరికి ఇబ్బందిగా తయారవుతుంది. ఆ ఇబ్బందిని  చూపించాలి , తెలియాలనే  ఈ  ఆర్టికల్ రాస్తున్నా  అంతే కానీ  ఒక్కర్ని తక్కువ చేయాలి అని కాదు.