DAD..MY HERO..!! Happy Father’s day to all the heros of real life..

Categories Lemonsoda's StoriesPosted on
happy father's day
Naanna.. ee maate oka emotion. Manalo manake telikunda prapancham lo connect ayye vyakthi evaraina unnaru ante nanna okkade. Prathi okkari life ki first hero athane.. alaa nanna gurunchi oka saadhaaranamaina koduku chepithe ela untundi.. adhe oka cinema pichi lo unna darshakudu chepithe ela untundo ani oka chinna aalochane ee article..
View of an ordinary son:- 
ప్రపంచంలో నిన్ను చూసి ఆనందంతో కంట నీరు పెట్టింది తనే..
నిన్ను భుజం మీద ఎత్తుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది తనే..
నీ అడుగుల్లో నీడలా నడిచింది తనే..
చిటికిన వేలు పట్టుకొని నడక నేర్పించాడు..!చేయి పట్టుకొని ప్రపంచాన్ని చూపించాడు..!!
నీ ఇష్టాలకోసం ఎన్నో కష్టాలు పడింది తనే..
లోటు లేని జీవితాన్ని నీకిచ్చాడు..! నువ్వెలే ప్రతి బాటకి తోడుగా ఉంది తనే..!!
నీ నుంచి ఇసుమంత కోరడు.. నీ గెలుపులో ఉండే ఆనందమే తనదిగా ఉంటాడు..
సంద్రమంత సంతోషం కోరడు.. చినుకంత ఆనందం చాలంటాడు..
అతనే నీ తండ్రి..  నీ మొదటి స్నేహితుడు,నీ మార్గదర్శి,నీ నిధి !!!
ఈ నిధికి ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పర్చిన ఆంగ్లేయులకు ధన్యవాదాలు..
dad

 

View of a son from film industry :- 
జీవితానికి అర్థం తెలియని రోజుల్లో నీ సినిమాకు హీరో ఆయనే…
జీవితం అంటే ఇలా ఉంటాదా అనుకునే రోజుల్లో నీ సినిమాకు విలన్ ఆయనే…
జీవితాన్ని చూస్తూ అది నీకు అర్థం కాని రోజుల్లో నీ సినిమాకు కమెడియన్ ఆయనే…
జీవితానికి ఒక అర్థం తెలుసుకున్న రోజు నీ సినిమాలో మళ్ళీ హీరో ఆయనే…
కానీ ప్రతీ క్షణం నీతో ఉంటూ…నీ జీవితం అనే ఒక కథకు ఆయన ఎప్పటికి హీరోనే… నువ్వు మారావే కానీ ఆయన కాదు..
నువ్వెన్ని చెప్పిన ఆయనను ఎలా మార్చినా.. నీతో ఒక సహాయకుడిగా.. సమ్రక్షుకుడిగానే ఉండేది నీ తండ్రి..
నా జీవిత కథకు మూలమైన నా తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు..

 

Happy Father’s day to all the heros of real life..