An untold story of a woman between love & betrayal

Categories BlogPosted on
love & betrayal
పుట్టిన దగ్గర నుంచి మన జీవితంలో మనతో ఉండే ప్రతి ఒక్కరు మనం కోరుకున్న వాళ్లే.. ఒక్క తల్లిదండ్రులు తప్ప. అలా నేను ఎంతో ఇష్టపడి కోరుకున్న ఒకరి రాకతో నా జీవితానికి ఒక అర్థం తెలిసింది. ఆ పరిచయం నుండే మొదలైన కథే నా జీవితం..
నా పేరు మధు.. డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో.. హాస్టల్లో ఉంటూ.. హాయిగా గడిచిపోయే రోజులు.
కొత్త స్నేహితులతో సిటీ మొత్తం చుట్టేసేదాన్ని. ఇంట్లో ఉంటే సినిమా చూడాలన్నా.. బయటికి వెళ్ళాలన్నా.. అన్నింటికి అడ్డుగా ఉండేది. ఒక్కసారిగా పంజరంలో నుండి బయట పడ్డ పక్షిలా అనిపించేది. కొత్త పరిచయాలు చాలా బాగుండేవి.. అలా పరిచయమైన వాళ్లలో నన్ను నాలా చూస్తున్న వాళ్లు కొందరే.. అందులో నాకు నచ్చిన వ్యక్తి కార్తిక్.
ఎప్పటినుండో ఆ పేరు అంటేనే నాకు చాలా ఇష్టం. అందుకే అతని మీద తెలియని భావం ఏర్పడిందేమో.. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఫోన్ వదిలేదాన్ని కాదు.. మాటలతో మునిగిపోయే వాళ్ళం. మాటలు.. మీటింగులు గా మారాయి.. మాటల్లోనే నచ్చిన వ్యక్తి కలిసాక మరింత నచ్చాడు.  తన ప్రేమ ఎప్పుడు చెప్తాడా అని ఎదురుచూసే దాన్ని.. కొన్ని రోజుల తరువాత అది కూడా జరిగిపోయింది. మొత్తానికి స్నేహం..ప్రేమగా.. మీటింగ్.. డేటింగ్ గా.. మారిపోయాయి.
ఈ పక్షికి జత దొరికింది..చివరికి రెండు పక్షులు ఒకే గూటికి చేరాయి. కార్తిక్ అంటే పిచ్చి మొదలైంది.. తను ఏది చేసినా కరెక్ట్ అనేలా నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. నేను తన జీవితంలోకి వచ్చాక తనకి ఉద్యోగం వచ్చిందని.. తనకి నేనొక అదృష్టం అని చెప్పేవాడు. ఆ మాట విని మురిసిపోయేదాన్ని.. ఇలా సంవత్సరం గడిచిపోయింది. కాలం పెరిగే కొద్ది క్యాంప్ కి వెళ్ళే రోజులు కూడా పెరిగాయి. కార్తిక్ బాగా గుర్తొచ్చేవాడు.. కాని ఉద్యోగం కదా అని నేను కూడా పెద్దగా బాధపడింది లేదు. అనుకోకుండా ఒకరోజు వచ్చి నాకు పెళ్లి అయిపోయింది.. మొన్నే బాబు పుట్టాడు అని చెప్పాడు. సరదాగా అంటున్నాడేమో అనుకొని అవునవును.. నేను విన్నా ఇంతకీ ఎలా ఉన్నాడు అని అడిగాను. కార్తిక్ తన ఫోన్ తీసి ఫోటో చూపించాడు. ఒక్కసారిగా నోటివెంట మాట రాలేదు.
మౌనం.. నా మాటలను కట్టేసింది..
కన్నీరు..నా బాధను నెట్టేసింది.. 
కాని
కార్తిక్.. నన్ను మనిషిగా చంపేశాడు.. 
నోటి వెంట మాట లేదు.. వాడి ముఖం చూడటానికి అసహ్యం.. వాడు తాకిన నా ఒంటిని అంటించుకోవలన్న విరక్తి నా మీద నాకే వేసింది. అక్కడ ఉండలేకపోయా.. నిముషాల్లో అన్ని సర్దేసా.. వెళుతూ.. వెళుతూ.. వాడి ముఖం మీద ఉమ్మేసి.. నీ మీద ఉన్న ప్రేమని ఇప్పుడిపుడే వచ్చిన అసహ్యం అందుకోలేకపోయింది.. అందుకే చంపకుండా వెళ్లిపోతున్నా.. నీ మొఖం ఎప్పటికీ చూపెట్టకు ఆ రోజు చంపినా చంపుతా..!!! GOODBYE.. 
రాతల్లో వివరించిన నా కథ.. చేతల్లో ఎవ్వరికీ ఎదురవ్వకూడదని ఆశిస్తూ.. సెలవు!!